గోపనపల్లిలో డెంగ్యూ పాజిటివ్ కేసు కలకలం
నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 4
నిజాంబాద్ నగరంలోని గోపనపల్లిలో డెంగ్యూ పాజిటివ్ కేసు నమోదు.
కేసు బయటపడడంతో గ్రామంలో స్ప్రే వర్క్, గృహ సందర్శనలు నిర్వహణ.
యాంటీ లార్వల్ పద్ధతులు అమలు చేసి, దోమల ఉత్పత్తిని అరికట్టే చర్యలు.
కార్యక్రమంలో గోవర్ధన్, హెచ్ ఇ ఓ మధుకర్, సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు, ఆశలు పాల్గొన్నారు.
ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసిన వైద్య సిబ్బంది.
గోపనపల్లిలో డెంగ్యూ పాజిటివ్ కేసు వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్య శాఖ స్ప్రే వర్క్ చేపట్టి, ప్రతి ఇంటిని సందర్శించి మలేరియా, డెంగ్యూ నిరోధక చర్యలు చేపట్టింది. యాంటీ లార్వల్ మెథడ్స్ అమలు చేసి దోమల పెరుగుదలను అరికట్టేందుకు చర్యలు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో గోవర్ధన్, హెచ్ ఈ ఓ మధుకర్, సూపర్వైజర్లు, ఏఎన్ఎం లు , ఆశా వర్కర్లు చురుకుగా పాల్గొన్నారు. ప్రజలు నీరు నిల్వచేయకుండా జాగ్రత్తలు పాటించాలని, శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారుల సూచనలు.