Site icon PRASHNA AYUDHAM

ఏసీబీకి పట్టుబడిన డిఈఓ రవీందర్

ఏసీబీకి
Headlines in Telugu:
  1. మహబూబ్ నగర్ డీఈఓ రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు
  2. డీఈఓ రవీందర్ 50,000 రూపాయల లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ బృందానికి పట్టుబడ్డాడు
  3. ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకున్న డీఈఓ రవీందర్ అదుపులో
  4. ఏసీబీ దాడిలో డీఈఓ రవీందర్ అదుపులో, 50,000 రూపాయలు స్వాధీనం

*మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుండి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు. పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియవలసి ఉంది.

Exit mobile version