టీటీయూ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీఈవో వెంకటేశ్వర్లు

సంగారెడ్డి ప్రతినిధి, జనవరి 9 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా బీరంగూడ ప్రాథమిక పాఠశాలలో టీటీయూ నూతన క్యాలెండర్ ను డీఈవో వెంకటేశ్వర్లు, మండల విద్యశాఖ అధికారి సుధాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించినట్లు టీటీయూ జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. న్యాల్ కల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి మారుతి నూతన క్యాలెండర్ ఆవిష్కరించినట్లు చెప్పారు. అదేవిధంగా రాంచంద్రాపూర్ లో మండల విద్యాదిఖారి పి.పి.రాథోడ్ టీటీయూ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ చేసినట్లు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యం.మోహన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు యం.శంకర్ కార్యదర్శులు, తుల్జారాం, జ్యోతి, సీతలక్ష్మి, అమీన్ పూర్, మండల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now