Site icon PRASHNA AYUDHAM

టీటీయూ జిల్లా క్యాలెండర్ ను ఆవిష్కరించిన డీఈవో వెంకటేశ్వర్లు

IMG 20251231 210531

Oplus_16908288

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) సంగారెడ్డి జిల్లా క్యాలెండర్ ను జడ్పీహెచ్ఎస్ పటాన్ చెరు, ఎంపీపీఎస్ బీరంగూడ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని, భావితరాలకు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులకు ఉందని అన్నారు. అనంతరం పటాన్చెరు మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల టీటీయూ నిరంతరం పని చేస్తుందని, అదేవిధంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు యం.మోహన్, జిల్లా అధ్యక్షుడు పి.ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రవికుమార్, కంది మండల అధ్యక్షుడు తుల్జారాం, సదాశివపేట మండల అధ్యక్షుడు జగన్మోహన్, మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, పటాన్ చెరు పాఠశాల గజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ మోహన్, ఎంపీపీఎస్ బీరంగూడ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఝాన్సీ రాణి, ఉపాద్యాయులు జ్యోతి, జయశ్రీ, సీతాలక్ష్మి, రవికుమార్ సుధారాణి, కవిత, లలిత, పద్మజా, ఫాతిమా, లలిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version