ప్రజారోగ్య పరిరక్షణకు వైద్య శాఖ పర్యవేక్షణ

ప్రజారోగ్య పరిరక్షణకు వైద్య శాఖ పర్యవేక్షణ

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రశ్న ఆయుధం జులై 26

ప్రజల ఆరోగ్య రక్షణ దృష్ట్యా జిల్లాలో తీసుకుంటున్న వైద్య చర్యలను పర్యవేక్షించేందుకు తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా శాఖా సంచాలకులు డా. నరేందర్ కుమార్ శనివారం కుషాయిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించారు. ఆయనతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సి. ఉమా గౌరీ కూడా ఉన్నారు.

ప్రస్తుత కాలానుగుణ వ్యాధుల పరిస్థితిని సమీక్షించేందుకు ఈ సందర్శన జరిగింది. వైరల్ జ్వరం, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలు, ల్యాబ్ సదుపాయాలు, మందుల నిల్వలు వంటి అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెక్టర్ బోర్న్ వ్యాధుల నియంత్రణ కార్యక్రమాధికారి డా. శ్రీదేవి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డా. రామదేవి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు తమ పరిసరాల స్వచ్ఛతపై దృష్టి సారించాలని, ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now