విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల తాసిల్దార్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరి రాము
విధులలో భాగంగా గ్రామాల సందర్శన తాసిల్దార్
జమ్మికుంట ఇల్లందకుంట అక్టోబర్ 22 ప్రశ్న ఆయుధం
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల తాసిల్దార్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూర్ రాము డిమాండ్ చేశారు బుధవారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట తాసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కార్యదర్శి రాము మాట్లాడుతూ,ఇల్లందకుంట మండల తాసిల్దార్ మధ్యాహ్నం 12 గంటలు దాటుతున్న సమయానికి రాకుండా మమ్ములను అడిగే వారు లేరు అని విధంగా తన ఇష్టం వచ్చినట్టు టైం కు వస్తూ తాసిల్దార్ ఆఫీస్ కు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రిజిస్ట్రేషన్స్ ఉంటే ఉదయాన్నే వస్తున్నారని రిజిస్ట్రేషన్ లేకుంటే ఆఫీసుకు ఎప్పుడొస్తారొ ఎప్పుడు పోతారో అంతా తన ఇష్టమని విధుల పట్ల ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తాసిల్దార్ పైన ఉన్నంత అధికారులు స్పందించి శాఖపరమైన చట్టపురమైన చర్యలు తీసుకోవాలని లేనియెడల జిల్లా కలెక్టర్ కి ఉన్నంత అధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు
మండల తాసిల్దార్ వివరణ
మండల తాసిల్దార్ ను వివరణ కోరగా తాను విధుల్లో భాగంగా మండలంలోని టేకుర్తి చిన్న కోమటి పెళ్లి గ్రామాలను వెళ్లడం జరిగిందని రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడానికి నేరుగా ఫీల్డ్ ఎంక్వయిరీ కి వెళ్లడం జరిగిందని తెలిపారు