రాహుల్ ని తీవ్రవాదిగా చిత్రీకరించడం హేమనీయం

*రాహుల్ గాంధీ మీద ఈగ వాలిన చూస్తూ ఊరుకోం*

*రాహుల్ గాంధీని తీవ్రవాదిగా చిత్రీకరించడం హేయనీయం* 

*మోడీ గాడ్సే విధానాలను ఆలంబిస్తున్నారు*

హుజరాబాద్ లో కూడా కేసు పెట్టండి కాంగ్రెస్ కార్యకర్తలారా*

టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్*

జమ్మికుంట హుజురాబాద్ ప్రశ్న ఆయుధం 

లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై ఈగ వాలిన ఊరుకోమని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు బుధవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ ని తీవ్రవాదిగా చిత్రీకరిస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హుజురాబాద్ లో రాహుల్ గాంధీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టాలని నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ కు సూచించారు గాంధీ కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాహుల్ గాంధీ,నెహ్రూ వేసిన బాటలో నేడు దేశం అభివృద్ధిలో ముందుకు పోతుందని భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ వచ్చిందని బీజేపీకి అక్కసు ఉందన్నారు తీవ్రవాదుల చేతుల్లో కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి రాహుల్ గాంధీ అని దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రధాని ఏందుకు స్పందించడం లేదని గాడ్సే విధానాన్ని మోడీ పాటిస్తున్నారని బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు రాహుల్ గాంధీ మీద ఈగ వాలిన ఊరుకునేది లేదు.మతాన్ని అడ్డుపెట్టుకొని మోడీ ప్రధాని అయ్యారని యావత్ భారతదేశం ఇప్పుడు రాహుల్ గాంధీ వైపు చూస్తుందని భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ దేశం లో అధికారంలోకి వస్తుందన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న బిజెపికి 100 సీట్లు కూడా రావని సూచించారు విలేకరుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లు బాబు మండల అధ్యక్షుడు కొల్లూరు కిరణ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత మండల అధ్యక్షురాలు లంక దాసరి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now