*తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కామెంట్స్..*
▪️ టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారు.మీరు చేసిన తప్పులకు ప్రభుత్వం నిందలు మోస్తోంది.
▪️పోలీసులు క్రౌడ్ మేనేజింగ్ చేయడంలో విఫలమవుతున్నారు
▪️తప్పు జరిగింది, పూర్తి బాధ్యత తీసుకుంటున్నాం.
▪️తొక్కిసలాట జరిగినప్పుడు హెల్ప్ చేసిన పోలీసులు ఉన్నారు.. అలాగే చోద్యం చూసిన పోలీసులు ఉన్నారు.
▪️పోలీసుల్లో కొందరు కావాలనే వ్యవహరించినట్టు బాధితులు చెప్పారు..దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.
▪️టీటీడీ ఈవో, ఏఈవోకు పవన్ కల్యాణ్ వార్నింగ్.. వీఐపీ యాటిట్యూడ్ మానేయండి..
▪️టీటీడీ ఈవోకు, అడిషనల్ ఈవోకు మధ్య గ్యాప్ ఉంది.
▪️టిటిడి బోర్డు మెంబర్లు చనిపోయినవారి ఇళ్లకు వెళ్లి క్షమాపణ చెప్పాలి.
▪️టీటీడీలో ప్రక్షాళన జరగాలి. వీఐపీలను కాదు.. సామాన్యుల దర్శనాలపై ఫోకస్ పెట్టాలి.