ప్రశ్న ఆయుధం న్యూస్ అశ్వారావుపేట( ఆర్ సీ)
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు జన్మదినం సందర్భంగా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మండల నాయకులు అభిమానులు కార్యకర్తలతో కలిసి భట్టి విక్రమార్క కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల పట్ల ఆయనకు ఉన్న దయ బడుగు బలహీన వర్గాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో గొప్పవని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఆయన ప్రజాస్వామ్య పరిరక్షణకు నిలువెత్తు ప్రతిరూపంగా తెలంగాణను సమానత్వంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్తు నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసే నాయకుడని కొనియాడారు. ఈ పుట్టినరోజు ఆయనకు ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో మరెన్నో ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టే శక్తిని కలిగించాలని.ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఎమ్మెల్యే జారే
