Site icon PRASHNA AYUDHAM

ఇకపై స్పోర్ట్స్ పీరియడ్ తప్పనిసరి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి..

ఇకపై స్పోర్ట్స్ పీరియడ్ తప్పనిసరి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్‌ను తప్పనిసరి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. గతంలో స్కూళ్లలో ఆటల పీరియడ్ ఉండేదని కాలక్రమంలో కనుమరుగైందని అన్నారు. చిన్నారులు సెల్‌ఫోన్లకు బానిసలుగా మారుతున్నారని, శారీరక శ్రమను ఇచ్చే క్రీడలకు వారిని చిన్నప్పటినుంచే సంసిద్ధం చేయాలని సూచించారు.

Exit mobile version