మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా అల్లాడుతుంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కనీసం అది గుర్తుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి వివాదంపై శాంతి హోమాలు చేయడం, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షలు చేయడం, మరోవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రక్షాళన పూజలు చేయడం అంటే ఏంటి అని ఆమె విమర్శించారు. ఈ విధంగా నాయకులు ఒకరిమీద ఒకరు పోటీ పడుతూ మత రాజకీయాలకు తెరలేపారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఆమె అనుమానం వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ బీజేపీ డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారని, మత ఘర్షణలు సృష్టించాలనే హిడెన్ అజెండా ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.
మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..
by admin admin
Published On: September 27, 2024 9:59 pm
