*సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి*
*డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు*
*జమ్మికుంట జులై 3 ప్రశ్న ఆయుధం*
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు అన్నారు కరీంనగర్ జిల్లా వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో నిర్వహించిన వైద్య శిబిరానికి డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ డాక్టర్ చందు హాజరయ్యారు వైద్య శిబిరంలో దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్న 21 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అనంతరం విద్యాలయంలోని బాలికలకు డాక్టర్ చందు వ్యక్తి గత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, రక్త హీనత వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి, సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, చికెన్ గుణ్య, మెదడువాపు, టైఫాయిడు, జాండిస్ మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి క్లుప్తంగా బాలికలకు వివరించారు. చేతుల పరిశుభ్రత గురించి హ్యాండ్ వాష్ చేసే పద్ధతులు గురించి అవగాహన కల్పించారు. బయటి తిను బండారాల జోలికి పోకుండా, మంచి పోషక పదార్తాలు తీసుకోవాలన్నారు. ఆకుకూరలు, పాలు, పండ్లు గ్రుడ్లు తీసుకున్నట్లయితే రక్త హీనత రాకుండా ఉంటుందని తెలిపారు ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేహించుకోవాలని బాలికలకు సూచించారు. అలాగే వసతి గృహంలోని వంటగదిని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని,పాఠశాల ప్రాంగణంలో నీరు నిల్వ ఉండకుండా,పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రిన్సిపాల్ కు సూచించారు.
ఈ కార్యక్రమములో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ చందు, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ ఝాన్సీ,హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్,మోహన్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఇందిరా, సూపర్ వైజర్ కుసుమ కుమారి, పంచాయతీ సెక్రెటరీ రాము,ఏఎన్ఎం మనీ,ఆశా కార్యకర్తలు సంపూర్ణ,దీపిక, పుష్పలత,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.