నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ.. డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు

నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీ

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు

జమ్మికుంట ఆగస్టు 11 ప్రశ్న ఆయుధం

సోమవారం రోజున కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జమ్మికుంట మున్సిపల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో నులిపురుగుల నిర్మూలన మాత్రలు ఆల్బెండజోల్ 44 ప్రభుత్వ పాఠశాలలకు 56 అంగన్వాడీ కేంద్రాలులకు 17 ప్రైవేట్ పాఠశాలలకు 1 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు,3 ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ,1 ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 2 ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పిల్లలకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పంపిణీ చేశారు ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చందు పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి లాంచనంగా కార్యక్రమం ప్రారంభించారు అనంతరం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ ఆల్బెండజోల్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకు వివరించారు.

మాత్రలు వేసుకోకుండా ఉన్న పిల్లలకు ఈనెల 18 వ తేదీ (Mop Up day)నాడు వేయడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాజేష్, డాక్టర్ చందన, డాక్టర్ ఫర్హానుద్దీన్, డాక్టర్ బిందు, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ సంధ్య,హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్,అడిదెలమోహన్ రెడ్డి, సూపర్వైజర్స్ రత్నకుమారి,అరుణ, కుసుమ కుమారి సదానందం వైద్య సిబ్బంది,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now