Site icon PRASHNA AYUDHAM

భద్రాచలం టౌన్ సేవాదళ్ అధ్యక్షుడిగా దేశ్ కార్తీక్

అధ్యక్షుడిగా
Headlines :
  1. దేశ్ కార్తీక్ ను భద్రాచలం టౌన్ సేవాదళ్ అధ్యక్షుడిగా నియమించా
  2. పోదెం వీరయ్య నియామక పత్రాలు అందజేసిన కార్యక్రమం
  3. సేవాదళ్ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయాలన్న నిర్ణయం

– నియామక పత్రాలు అందజేసిన డిసిసి అధ్యక్షుడు పోదెం వీరయ్య

భద్రాచలం పట్టణ సేవాదళ్ అధ్యక్షుడిగా దేశ్ కార్తీక్ ను నియమిస్తూ ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షుడు పోదెం వీరయ్య, నియామక పత్రాన్ని దేశ్ కార్తీక్ కు అందజేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొదూమూరి దయాకర్, జిల్లా అధ్యక్షుడు కేశబోయిన నరసింహారావు సమక్షంలో దేశ్ కార్తీక్ కు పోదెం వీరయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సేవాదళ్ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన కార్తీక్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను నాకు ఇచ్చిన రాష్ట్ర, జిల్లా, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సేవాదళ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలో పూర్వవైభవం తీసుకొస్తానని తెలిపారు.

Exit mobile version