Site icon PRASHNA AYUDHAM

బీవీఆర్ఐటీ కళాశాలను సందర్శించిన చెనాబ్ వంతెన రూపకర్త డాక్టర్ మాధవి లత

IMG 20251025 211509

Oplus_16908288

నర్సాపూర్, అక్టోబర్ 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన సివిల్ ఇంజనీర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సీ) బెంగళూరు ప్రొఫెసర్ మరియు జమ్మూ & కాశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత చెనాబ్ వంతెన రూపకర్త డాక్టర్ జి. మాధవిలత శనివారం నర్సాపూర్‌ సమీపంలోని బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రయోగశాలలు, సాంకేతిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చైర్మన్ కె.వి.విష్ణు రాజు, వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్ లను మర్యాదపూర్వకంగా కలసి విద్యా, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె సివిల్ ఇంజనీరింగ్ విభాగ అధ్యాపకులతో ఆధునిక నిర్మాణ సాంకేతికతలపై చర్చ జరిపి, “జియో ప్రాక్టీసెస్ 2025”లో భాగంగా ప్రఖ్యాత “ఎం.ఆర్. మాధవ్ లెక్చర్”లో “చెనాబ్ బ్రిడ్జ్ – దాని ఆవశ్యకత” అనే అంశంపై ఆకర్షణీయమైన ఉపన్యాసం అందించారు. ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్, బిట్స్ హైదరాబాద్, మహీంద్రా యూనివర్సిటీ, ఐఐటీ తిరుపతి అధ్యాపకులు, జాకబ్స్ (జాకబ్స్), గ్రీన్‌కో (గ్రీంకో) వంటి సంస్థల నిపుణులు, విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సంనుజయ్ దూబీ, డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ ప్రసాద్, సివిల్ విభాగాధిపతి డాక్టర్ ఎస్. కృష్ణరావు, కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ విజయ్ కుమార్, మేనేజర్ బాపిరాజు, ఏవో సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version