మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల జీవితాలు నాశనం
మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జమ్మికుంట అక్టోబర్ 15 ప్రశ్న ఆయుధం
నేటి సమాజంలో మాదక ద్రవ్యాల తీసుకుంటూ వారి జీవితాలను నాశనం వారే నాశనం చేసుకుంటున్నారని ప్రజలకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించాలని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన మెప్మా ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ముగ్గులు వేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ మాదకద్రవ్య దుర్వినియోగం వల్ల చాలా మంది జీవితాలు నాశనమయ్యాయని ఈ చెడు ప్రభావాల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, మాదకద్రవ్యాల వ్యాపారాన్ని అంతం చేయాలని, మనం మాదకద్రవ్య రహిత పట్టణంగా జమ్మికుంటను సాధించాలన్నారు. మాదకద్రవ్య వ్యసనం బానిస, వ్యక్తి, కుటుంబం సమాజంలోని పెద్ద వర్గంపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుందని ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయంగా మారిందని పేర్కొన్నారు మాదకద్రవ్య రహిత సమాజాన్ని సాధించడానికి మనం ప్రతిజ్ఞ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎ.డి. ఎం.సి. మల్లీశ్వరి ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష, సి.ఎల్. అర్పిలు జ్యోతి, మంజుల, అర్పిలు, ఓబీలు, సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు.