Site icon PRASHNA AYUDHAM

వివరాలు గోప్యంగా ఉంచుతాం…!!

*బాల్య వివాహాలను ఉపేక్షించేది లేదు*

*టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి సమాచారం అందించండి*

*మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం .. జిల్లా కలెక్టర్*

*మచిలీపట్నం:*

బాల్యవివాహాలను ఉపేక్షించేది లేదని, జిల్లాలో బాల్య వివాహాలు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని, *బాల్య వివాహాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వారు వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1098 కి ఫోన్ చేసి తెలపాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.*సచివాలయ మహిళా పోలీస్, అంగన్వాడి కార్యకర్తలు, సిబ్బంది వారి పరిధిలో జరిగే బాల్య వివాహాలపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

Exit mobile version