సమగ్ర కుటుంబ సర్వే మరియు కుల గణన తోనే బడుగు బలహీనవర్గాల అభివృద్ధి,స్వాతంత్రం వచ్చాక దేశంలోనే మొదటిసారి కుల గణన.భారత్ జోడు యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కుల గణన.తెలంగాణ దేశానికి ఆదర్శంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి అని స్థానిక రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ గారు తెలిపి రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో ఉన్న కార్పొరేటర్ నివాసంలో ఎఎంసి సురంజన్,సర్వీసర్,ఎన్యూమరేటర్,ఇతర అధికారులతో కలిసి ప్రారంభించి,బిసి బి కురుమ కులస్థులైన మేము సర్వే కొరకు మొదటి మెట్టుగా అన్ని విధమైన సమాచారం ఇస్తాం అని,ప్రతి యొక్క నివాసికులు తమతమ వివరాలు సర్వే అధికారులకు తెలిపి సమగ్ర సర్వే విజేయవంతంగా చెయ్యాలి అని డివిజన్ ప్రజలకు తెలిపిన రామచంద్రపురం కార్పొరేటర్ గారు.సమగ్ర కుటుంబ సర్వేతో బడుగు బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయపరంగా అభివృద్ధి చెందుతాయని,స్వాతంత్రం వచ్చాక దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ ప్రభుత్వం సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ,కుల గణన కార్యక్రమం చేపట్టిందని కార్పొరేటర్ గారు తెలిపారు.వారితో నాగభూషణం,తిరుమల గౌడ్,బుచ్చి రెడ్డి,వాసుదేవ్,చందు,మాధవ రెడ్డి,రాజశేఖర్ తదితరులు.