ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి:
బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదు 2024, కార్యశాల (వర్క్ షాప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు, నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరిట డ్రామాలు చేస్తుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలను ఎఫ్ టీ ఎల్ బఫర్ జోన్ ఆక్రమించిన వారి పైన అనుమతులు ఇచ్చిన అధికారుల పైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములు చెరువులు, కబ్జాకు గురి అయ్యాయో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నామ మాత్రపు తొలగింపుల ద్వారా నాటకాలు ఆడవద్దని, ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, ఆక్రమణకు గురైన స్థలాలను పరిరక్షించాలని, అక్కడి కట్టడాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజి రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి.అంజిరెడ్డి, ఏ.విష్ణువర్ధన్ రెడ్డి, ఆదేల్లి రవీందర్, ఎడ్ల రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి, పోచారం రాములు, ప్రతాప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శిలు అనంతరావు కులకర్ణి, రాజశేఖర్ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయకుమార్, ద్వారకా రవి, పుల్లంగారి సురేందర్, శ్రీనివాస్, సుధాకర్, ప్రవీణ్ యాదవ్, ఎల్లన్న, నరేన్ ,రవి శంకర్, సదానంద చారి, భాస్కర్, నల్ల నరసింహారెడ్డి, నర్సారెడ్డి, ఏం.విశ్వవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సుదీర్, బండారి శ్రీనివాస్ గుప్తా, సోమా అనిల్, నరేష్, బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్, అరుణ కోలాస్, తేజస్విని, లక్ష్మి జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.