కేంద్ర ప్రభుత్వ నిధులతోని గ్రామాల అభివృద్ధి
స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అభ్యర్థుల గెలిపి లక్ష్యంగా పనిచేయాలి
బిజెపి కార్యకర్తలకు దిశా నిర్దేశం
బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి
ఇందిరమ్మ ఇండ్లలో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా కూడా ఉంది
బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి
జమ్మికుంట ఇల్లందకుంట జులై 24 ప్రశ్న ఆయుధం
కేంద్ర ప్రభుత్వ నిధుల తోటే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని , ఇందిరమ్మ ఇండ్ల లో కేంద్ర ప్రభుత్వ నిధుల వాటా కూడా ఉందని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేంద్ర ప్రవీణ్ రెడ్డి బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి అన్నారు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిజెపి మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి నిర్వహించిన బిజెపి స్థానిక ఎన్నికల మండల కార్యశాలలో హాజరైన బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేడ్ల ప్రవీణ్ రెడ్డి మండలాధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని గ్రామాల్లో వైకుంఠదామాలు, సెగ్రేషన్ షెడ్లు, నర్సరీల నిర్వహణ, గ్రామ పంచాయతీల నిర్వహణతో పాటు ఇటివల గ్రామాలలో వేసిన సిసి రోడ్లు సైతం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మంజూరి అయిన నిధులు మాత్రమే లబ్ధిదారులకు చెల్లిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో అధికారదర్పంతో విర్రవిగుతున్నారు తప్ప గ్రామాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యంమని ఎద్దేవా చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ ఎన్నికలు నాయకుల ఎన్నికలు కావని కార్యకర్తల ఎన్నికలని కనుక ప్రతి ఒక్కరు పని చేయాలని పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి బిజెపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు ఒకటేనని
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాబోయే స్థానిక ఎన్నికలకు బిజెపి నాయకులు సిద్దం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, కంకణాల రవీందర్ రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి,అబ్బిడి తిరుపతి రెడ్డి,ఎండీ షఫీ, నల్ల లింగారెడ్డి,మురహరి గోపాల్, మట్ట పవన్ రెడ్డి,తాళ్ల పాపిరెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మద్దూరి మల్లేష్,మర్రి చుక్కాల్ రెడ్డి,ఉప్పు దుర్గయ్య, కొక్కుల దేవేందర్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుకుంట్ల సంజీవ్, తిప్పరబోయిన సమ్మయ్య,జంగం సమ్మయ్య,రేణుకుంట్ల కుమార్,పుట్ట శ్రీధర్, చిట్ల శ్రీనివాస్, శీలం సాయిప్రసాద్ రెడ్డి,రాధారపు ఐలయ్య మరియు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు