కన్కల్ గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తెలంగాణ స్టేట్ ఇంచార్జ్
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 22
కన్కల్ గ్రామంలో సోమవారం “హిందూ దుర్గా సమితి” వారి ఆధ్వర్యంలో, ఘనంగా బాల త్రిపుర దేవి అవతారం ప్రారంభమైంది. తొలి రోజు దేవి అవతార దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భజనలతో, శంఖనాదాలతో, డప్పుల మోగింపుతో దేవాలయ ప్రాంగణం మార్మోగిపోయింది. మహిళలు సంప్రదాయ వేషధారణలో కొలువై, భక్తిగీతాలతో దేవిని ఆరాధించారు. చిన్నారులు కూడా సాంప్రదాయ క్రీడలతో, ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
పురోహితులు ప్రత్యేక అర్చనలు నిర్వహించగా, భక్తులు తులసి, కుంకుమార్చనలతో దేవిని కీర్తించారు. ఈ సందర్భంగా స్థానికులు ఉత్సవాల విజయవంతం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు “హిందూ దుర్గా సమితి” కమిటీ వారు తెలిపారు.