అమర్నాథ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు
అమర్నాథ్ యాత్రకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 3 లక్షల మందికిపైగా మంచు లింగాన్ని దర్శించుకున్నారు. జులై 2వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి జులై 21వ తేదీ వరకూ అంటే 19 రోజుల్లో 3.21 లక్షల మందికిపైగా భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ యాత్ర ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ రోజున ముగియనుంది.