నాగారంలో భక్తి, సేవలతో అన్నదాన కార్యక్రమాలు
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 04
నాగారం మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం పలు కాలనీలలోని గణపతి మండపాల వద్ద భక్తి, సేవా స్ఫూర్తితో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాదిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. వారు స్వయంగా అన్నప్రసాదం వడ్డించి, భక్తుల ఆదరాభిమానాలను పొందారు.
ఈ అన్నదాన కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు నాగారంలో సామరస్యం, ప్రజా ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయని నాయకులు పేర్కొన్నారు. సేవాభావం, పండుగ వాతావరణం కలగలిసి గురువారం రోజు నాగారంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.