సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లిలో బీరప్ప–కామరధి కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కొండపోచమ్మ ఆలయ చైర్మన్ అనుగీత కప్పర ముఖ్య అతిథిగా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా అనుగీత కప్పర మాట్లాడుతూ, కురుమల ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలకు అందేలా ఇలాంటి పండుగలు కీలకమని, బీరప్ప–కామరతి కళ్యాణం ఆధ్యాత్మిక వేడుకతో పాటు సమాజ ఐక్యతను బలోపేతం చేసే సాంస్కృతిక ఉత్సవమని పేర్కొన్నారు.
ప్రస్తుత తరానికి తమ మూలాలను పరిచయం చేయడంలో ఈ మహోత్సవం ప్రధాన పాత్ర పోషిస్తోందని, యువత ఇలాంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. కురుమ సమాజ అభివృద్ధికి, సంక్షేమానికి తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒగ్గు కళాకారుల కథనంతో కూడిన ఒగ్గు పూజా కార్యక్రమాలు వేడుకకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.











