కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఆలయ అర్చకులు శ్రీహర్ష ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన వంటి కార్యక్రమాలు జరిగాయి.
శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం జరిగిన పల్లకీ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, 11వ వార్డ్ కౌన్సిలర్ రాణి శ్రీనివాస్ తో పాటు పలువురు కాలనీవాసులు, మహిళలు హాజరయ్యారు.












