సంగారెడ్డి, జూలై 16
సదాశివపేటలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 20న మధ్యాహ్నం 1గంటలకు నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు పిలుపునిచ్చారు. ఈ రథయాత్ర భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెబుతుందని ఆయన అన్నారు.
సదాశివపేటలో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 20న మధ్యాహ్నం 1గంటలకు నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘన విజయవంతం చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజు పిలుపునిచ్చారు.
శ్రీ జగన్నాథ రథయాత్రకు సంబంధించిన కరపత్రాన్ని ఇస్కాన్ టెంపుల్ భక్త బృందం సభ్యులు పులిమామిడి రాజుకు అందజేసి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ, శ్రీ జగన్నాథ రథయాత్ర భారతీయ సనాతన ధర్మ వైభవాన్ని చాటిచెప్పే మహోత్సవమని అన్నారు.
భక్తి, ఐక్యత, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర రథయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ జగన్నాథ స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. కార్యక్రమానికి హెచ్. హెచ్. భక్తి వైభవ స్వామి ప్రభుపాద ప్రచారక్ ప్రభువానంద దాస్ ప్రభుజీ విచ్చేసి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించనున్నారని పేర్కొన్నారు.
సదాశివపేట పట్టణంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై ఈ దివ్య రథయాత్రను విజయవంతం చేయడంతో పాటు భగవంతుని కృపకు పాత్రులు కావాలని పులిమామిడి రాజు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ ప్రభు, మాశెట్టి ప్రవీణ్ కుమార్, వేణు గోపాల్, రామ క్రిష్ణ, అభి రామ్ మరియు పి. ఎం. ఆర్ యవసేన నాయకులు రాగం అనిల్, గుణాకర్, తాలెల్మ రాము, సోమ శంకర్, అఖిల్ మొదలగు వారు పాల్గొన్నారు.












