సంగారెడ్డి, జూలై 19
సంగారెడ్డి పట్టణంలో ఆషాడ మాసం సందర్భంగా బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా కుమ్మర్లు తొలి బోనాన్ని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు.
ఆషాడ మాసం సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయం ప్రకారం కుమ్మర్లు ఎఫ్అర్ఎస్ ఎల్లమ్మ తల్లికి తొలి బోనాన్ని సమర్పించారు. ఐబి నుండి ఎల్లమ్మ గుడి వరకు బోనాలను ఊరేగించారు. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఈ బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఆషాడమాసం అత్యంత పవిత్రమైన మాసం అని, ఈ మాసంలో అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కిరణ్ గౌడ్, కౌన్సిలర్లు శైలేష్ రెడ్డి, కృష్ణ, అశ్విన్, కాంగ్రెస్ నాయకుడు శ్రీశైలం, కుమ్మరి సంఘం పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.












