రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో 18 రోజుల హుండీ ఆదాయం రూ.93,52,748/-గా నమోదైంది. దీంతో పాటు బంగారం, వెండి కూడా భక్తులు సమర్పించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీలను లెక్కించారు. ఈ లెక్కింపులో 18 రోజుల ఆదాయంగా నగదు రూపంలో రూ.93,52,748/- వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
నగదుతో పాటు, భక్తులు తమ మొక్కుల రూపంలో సమర్పించిన బంగారం 60 గ్రాములు, 100 మిల్లిగ్రాములు, వెండి 2 కిలోల 900 గ్రాములు కూడా హుండీ ద్వారా లభించినట్లు అధికారులు తెలిపారు.
ఈ హుండీ లెక్కింపు ప్రక్రియను ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి, కరీంనగర్ ఏసీ ఆఫీస్ ప్రతినిధి శ్రీ రాజమౌళి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అధికారులు, పోలీసు సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.











