ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా “దేవులపల్లి మహేందర్ యాదవ్”
*గజ్వేల్ నియోజకవర్గం ప్రతినిధి, డిసెంబర్ 28, ప్రశ్న ఆయుధం
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా గజ్వేల్ పట్టణానికి చెందిన దేవులపల్లి మహేందర్ యాదవ్ ఎంపికయ్యారు. సిద్దిపేటలో జరుగుతున్న 43వ రాష్ట్ర మహాసభల్లో ఆయనను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మహేందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర శాఖ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, అదేవిధంగా విద్యారంగ సమస్యలకై విద్యార్థుల పక్షాన పోరాడుతు వారికి అండగా నిలుస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ నీ బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని పేర్కొన్నారు.