వధూవరులకు ధమ్మపద బుద్ధుడు, అంబేడ్కర్ చిత్రపటం బహుకరణ..

వధూవరులకు ధమ్మపద బుద్ధుడు,

అంబేడ్కర్ చిత్రపటం బహుకరణ..

తెలంగాణ రాష్ట్రంలో బహుజన సైద్ధాంతిక ఉద్యమం చాప కింద నీరులా ప్రవహిస్తున్నట్లు తెల్సిందే. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు అంబేడ్కర్ విగ్రహాలకు పెట్టిన కోటగా దేశంలో పేరుగాంచిన విషయం విదితమే. అయితే ప్రస్తుతం నేటి యువతరంలో అంబేడ్కరిజం సంచరించడం ఈ శుభ పరిణామమే. శుక్రవారం ఉదయం జిల్లా నిజమాబాద్ బాల్కొండ మండలంలోని ఇత్వార్ పేట్ గ్రామంలో ఎనుగందుల నర్సయ్య మహారాజ్ మరియు మేఘన మహారాణిల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి భవ్య తైలచిత్రం స్థానిక నేతలు కార్యకర్తలు ఖుషిగా బహుకరించారు. ఇట్టి శుభ పెండ్లికి డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు డి.ఎల్ మాల ఆయన టీం హాజరైయ్యారు. ఈ మేరకు వధూవరులకు భారతరత్న భీంరావు ఫొటో తోసహా “ధమ్మపద బుద్ధుడు” అనే తాత్విక పుస్తకాన్ని కూడా భేటీ ఇచ్చారు. ఈ పెండ్లి వేడుకల్లో సి.ఎచ్ ప్రసాద్, భార్గవ్ అవినాష్, గణేష్ తదితరులు పాల్గొని యువ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు..

Join WhatsApp

Join Now