నిజామాబాద్ జిల్లా (ప్రశ్న ఆయుధం)
నిజామాబాద్ డిసెంబర్ 21:
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో గల రిలయన్స్ మాల్ ఎదురుగ ఉన్న కిసాన్ హైట్స్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ, బిక్ష నిర్వహించారు. ధన్ పాల్ వినయ్ కుమార్ స్వామి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి మహా పడిపూజ, అభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు హిందూ ధర్మంలో భాగంగా వ్యక్తి యొక్క నడవడిక మానవ జీవన విధానం భక్తి మార్గంలో నడవడానికి అయ్యప్ప దీక్ష ఎంతో దోహదపడుతుందని అన్నారు. ప్రతి మనిషి తన జీవితంలో అయ్యప్ప దీక్ష తీసుకోవడంతో మానవ జన్మ పరిపూర్ణం అవుతుందని అన్నారు. తమ కుటుంబం నుండి గత ఇరవై ఏళ్లుగా అయ్యప్ప దీక్ష తీసుకోవడం ఆనవాయితీగా వస్తుందని అది తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకున్న నాటి నుండి కఠినమైన నియమ నిష్టలతో దైవ ఆరాధనలో ఎలాగైతే ఉంటారో దీక్ష అనంతరం కూడా హిందూ ధర్మం రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. భక్తిలో కూడా దేశ భక్తిని చాటే చెప్పే విదంగా మణికంఠునికి త్రివర్ణ పథకం రంగులతో అభిషేకం నిర్వహించడం అందరి భక్తులను ఆకట్టుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్ద ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.