ధరణి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి:

*ధరణి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి:*

*జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 23 (ప్రశ్న ఆయుధం న్యూస్): ధరణి మాడ్యూల్స్ లో ఉన్న పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి రెవెన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఆర్డీవోలు, తహసిల్దార్లతో ధరణి పెండింగ్ సమస్యలు, ప్రజావాణి, సీఎం ప్రజావాణి, నూతన ఓటరు నమోదు – ఎస్ ఎస్ ఆర్ 2025, తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ధరణి సమస్యల పరిష్కారం, ప్రజావాణి సమస్యల పరిష్కారం, నూతన ఓటరు నమోదు తదితరు అంశాలలో రెవిన్యూ యాంత్రాగం ప్రధాన భూమిక పోషించాలని అన్నారు. ధరణి మాడుల్స్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే క్లియర్ చేసేలా రెవెన్యూ అధికారులు కృషి చేయాలని అన్నారు. అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలని మండల తహసీల్దార్లను ఆదేశించారు. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్ వంటి దరఖాస్తులకు అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, డేటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో పెండింగ్ దరఖాస్తులు వచ్చే నెల మొదటి వరం లోగా పూర్తీ చేయాలనీ అన్నారు . కొత్తగావచ్చే ప్రజావాణి ధరకాస్తులకన్నా ముందే పాతవాటిని పూర్తిగా పరిష్కరించాలని ఆదేశించారు. మండలవారీగా పెండింగ్ ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా రెవెన్యూ అధికారులు కృషి చేయాలని అధికారులకు ఆదేశించారు. అక్రమకట్టడలపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, ప్రభుత్వ భూములను కచ్చితంగా కాపాడాలని అన్నారు. పట్టణాలలో ఎల్ ఆర్ ఎస్ అప్ప్లీకేషన్ లను త్వరగా పూర్తిచేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పద్మజారాణి, జిల్లాలోని ఆర్డీవోలు తహసిల్దార్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment