ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా:.

ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని ధర్నా:.

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి ( బాన్సువాడ)

బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ, శానిటేషన్, పేషంట్ కేర్ కార్మికులకు నాలుగు నెలల( జనవరి నేలతో కలిపి ) బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ రాష్ట్ర మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( ఏఐటియుసి ) బాన్సువాడ డివిజన్ కమిటీ ఆ ధ్వర్యంలో ఎం సి హెచ్ హాస్పిటల్ ముందు ధర్నా నిర్వహించరు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బాలరాజ్ మాట్లాడుతూ కార్మికులకు నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించే వరకు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మికులకు నెలల తరబడి జీతాలు రాకపోవడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్ దశరథ్, దుబాస్ రాములు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, ప్రతి నెల ఐదవ తేదీ నా జీతాలు జమ చేయాలని, కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలని, జాతీయ పండగ సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు నెలల బకాయి వేతనాలు కార్మికుల ఖాతకు పడే వరకు ఉద్యమానీ కొనసాగించడం జరుగుతుందన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో రేణుక,సురేఖ, సయ్యద్ కమర్ అలీ, జైల్ సింగ్, సంగీత, ఎం గంగారాం, సుశీల, కాశీరాం, శంకర్, అనసూయ, కళ్యాణి, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment