Site icon PRASHNA AYUDHAM

పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ ధర్నా

*పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన ధర్నా*

*హుజురాబాద్ నవంబర్ 5 ప్రశ్న ఆయుధం::-*

మంగళవారం రోజున స్థానిక తాసిల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ ఆల్ పెన్షనర్ల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ ఆందోళన ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వానికి నివేదించాలని మండల తాసిల్దార్ కోడెం కనుకయ్య కి మెమోరండం అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు టాప్ర రాష్ట్ర శాఖ ఆదేశానుసారము పెన్షనర్ల పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు ధర్నా కార్యక్రమం నిర్వహించి తహసీల్దారు కోడెం కనకయ్య కి మెమోరాండం ఇవ్వనైందని టాప్రా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ గౌరవాధ్యక్షులు కట్ట నాగభూషణాచారి మాట్లాడుతూ పెండింగులో ఉన్న డిఏ లను వెంటనే ప్రకటిస్తూ రెండవ పిఆర్సి ని ప్రకటించి జూలై 2023 నుండి అమలుపరచాలని ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు అర్హత కలిగిన ఈపిఎస్ పెన్షనర్లకు పెన్షన్ మంజూరు చేయాలని పెన్షనర్ల కమ్యూటేషన్ తగ్గింపును 15 సంవత్సరముల నుండి 12 సంవత్సరములకు కుదించి స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేస్తూ పెన్షనర్లకు కూడా ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ఇవ్వాలని కోరినారు ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ హెచ్ ఎస్ స్కీం అమలుపరుస్తూ గ్రాట్యుటీ 20 లక్షలకు పెంచుతూ పెన్షనర్లకు మెడికల్ అలవెన్స్ 3000 రూపాయలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినారు ధర్నా కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బోంగోని వెంకటయ్య గరిగ చంద్రయ్య సయ్యద్ మునీరుద్దీన్ బైరి ప్రకాష్ రాయికంటి రామకృష్ణయ్య హుజురాబాద్ శాఖ ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య కోశాధికారి మండల వీరస్వామి శీలం మల్లేష్ గౌరీశెట్టి సాంబయ్య తాటిపాముల కనకయ్య తౌటం శ్రీహరి దొంత హరికిషన్ గాజర్ల బుచ్చిరాజం గాజ గంగయ్య అబ్దుల్ రహీం తాళ్ల రామ కిష్టం మూల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Exit mobile version