ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా…!
ప్రశ్న ఆయుధం కామారెడ్డి జిల్లా
భిక్కనూర్, అక్టోబర్ 25
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ ఎత్తున ధర్నా చేపట్టారు .కామారెడ్డి జిల్లా కేంద్రం లోని స్థానిక కొత్త బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించి, దిష్టి బొమ్మ దహనం చేసినట్లు తెలిపారు .ఈ సందర్బంగా జిల్లా ఏబీవీపి కార్యదర్శి సాయికుమార్ మాట్లాడుతూ.. తక్షణమే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న రూ.8900 కోట్ల స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయాలన్నారు . లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్ తో పాటు, సంజయ్, విద్యార్థులు పాల్గొన్నారు.