దేనికలాన్ గ్రామంలో డయేరియా కలకలం
కామారెడ్డి జిల్లా తాడ్వాయి
(ప్రశ్న ఆయుధం) జులై 24
డయేరియ కేసులు నమోదైన తాడ్వాయి మండలంలోని దేమికలాన్ గ్రామంలో గురువారం రోజున ఎలాంటి కొత్త కేసులు నమోదు కాకుండా సాధారణ పరిస్థితిలు నెలకొన్నాయని, కామారెడ్డి ఆర్డిఓ వీణ, తెలిపారు.
గురువారం రోజున జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్,తో కలిసి కామరెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించి డయేరియాతో, చికిత్స పొందుతున్న దేమికలాన్ గ్రామానికి చెందిన బాధితులకు కలవడం జరిగిందని, అలాగే ఆస్పత్రి ఆర్ఎంఓ తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోగా దేమికలాన్ గ్రామానికి చెందిన మొత్తం 9 మంది, డఏరియాలో ఆసుపత్రిలో చేరగా వారికి వైద్య సేవలు అందించామని వారిలో 6 గురి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని మిగతా 3 గురి ఆరోగ్య పరిస్థితి నిలబడగా ఉందని, వైద్య సేవ అందిస్తున్నామని, తెలిపారని అన్నారు.
అనంతరం దేనికలాన్ గ్రామాన్ని సందర్శించి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య క్యాంపు మరియు పారిశుద్ధ్య కార్యక్రమాలను,, త్రాగునీరు సరఫరా కార్యక్రమాలను పర్యవేక్షించడం జరిగిందని, ఈరోజు ఏ ఒక్కరికి కూడా డయేరియా వ్యాధి నిర్ధారణ కాలేదని అన్నారు.
అదేవిధంగా బుధవారం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలోని ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ బోర్ వెల్స్ మరియు సింగిల్ ఫేస్ మోటార్స్ నుంచి సరఫరా చేస్తున్న మంచినీటి శాంపిల్స్ 18 సేకరించి ల్యాబ్ పంపడం జరిగిందని, ఈరోజు వచ్చిన రిపోర్టులో నీరు కలుషితం అయినట్టు ఎలాంటి రిపోర్టు రాలేదని నీరు శుద్ధమైనవిగా రిపోర్టు వచ్చిందన్నారు.అలాగే గురువారం రోజున ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, మరియు సూపరింటెండెంట్, ఇంజనీర్ల నేతృతంలోని బృందం దేమీకలాన్ గ్రామంలో పర్యటించి డ్రింకింగ్ వాటర్ సప్లై పైప్ లైన్ మరియు, OHSR లను పరిశీలించిన చేయడం జరిగిందని ఎక్కడ కూడా ఎలాంటి వాటర్ లీకేజ్ లేదని వారు నిర్ధారించారని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో సాధారణ పరిస్థితి కొనసాగేలా పరిశుద్ధ కార్యక్రమాల నిర్వహణ, మెడికల్ క్యాంపు నిర్వహణ, త్రాగునీరు సరఫరా ఇతర అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కామారెడ్డి ఆర్డిఓ తెలిపారు.