డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
గజ్వేల్ సెప్టెంబర్ 5 ప్రశ్న ఆయుధం :
హస్టల్,గురుకుల,కెజిబివి, విద్యార్థులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డైట్,కాస్మొటిక్ చార్జీలను పెంచాలని కొరుతూ…గురువారం డిప్యూటీ తహశీల్దారు బార్గవ్ కి డిబిఎఫ్ అధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి ఏగొండ స్వామి డిప్యూటీ తహశీల్దారికి తెలియచేస్తూ గజ్వేల్ డివిజన్ వ్యాప్తంగా వున్న ప్రభుత్వ గురుకుల,కెజిబివి,సంక్షేమ తదితర హస్టల్ లలో ఎస్సీ ఎస్టీ, బిసి,మైనారిటీ తదితర పేద వర్గాలకు విద్యార్ధిని విద్యార్థులు విద్యను ఆభ్యసిస్తున్నారు. ఈ విద్యాలయాలలో కనీస సదుపాయాలు కరువై నరకయాతన పడుతున్నారు.ప్రభుత్వ పర్యవేక్షణ లేకపొవడంతో టిచర్ల,వార్డెన్ , ప్రవెట్ కాంట్రాక్టర్ల లదే ఇష్ఠారాజ్యాంగా మారడంతో పిల్లలు తమ సమస్యల పరిష్కారానికి రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి కి నెట్టబడుతున్నారు.ఇకనైన ప్రభుత్వం నిర్లక్ష్యం, వివక్షను విడనాడి ప్రభుత్వ విద్యాలయాలలో వసతులను మెరుగుపరిచి నాణ్యమైన విద్యాబోధన చెయాలి. ఇక అహరంలో నాణ్యత కరువైనది.పురుగుల అన్నం,కుళ్ళిపొయిన కూరగాయాలు ఆహర పదార్ధాలను అందజెస్తున్నట్లు పాలమాకుల పిల్లల ఆందోళన తో మరొసారి రుజువైనది.
పెరుగుతున్న ధరలకనుగుణంగా డైట్ చార్జీలు పెంచకపొవడంతో పిల్లలు అర్ధాకాలితో అలమటిస్తున్నారు.డైట్ చార్జిలు 2017-18 నుండి నెటికి పెంచలేదు.కాని నిత్యావసర సరుకుల,కూరగాయలు,గుడ్డు,చికెన్,మటన్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో నిర్వహకులు పిల్లలకు నాణ్యమైన ఆహరం అందించడం లేదు.ఒక్కొక్క సారి గుడ్డు,చికెన్,మటన్ లను పెట్టడం లేదు.కనుక పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను పెంచాలి. గత ఏప్రిల్ నుండి చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేయాలి.మూడు నెలల అడ్వాన్స్ గా నిధులను అందజేయాలి.
ఇక కాస్మొటిక్ చార్జీలను అయితే పెంచక 16 సంవత్సరాలు దాటింది.సబ్బుల,నూనె, పౌడర్ ,శానిటరి న్యాపికిన్స్ ల ధరలు రోజు రోజుకు పెరిగిపొతున్నాయి.కనుక కాస్మొటిక్ చార్జీల ను పెంచాలని కోరుతున్నాం. బిక్ష గా కాకుండా హక్కుగా నిధుల ను విడుదల చేయాలి. ఉపాధ్యాయులకు,సిబ్బంది కి కుల,మత,ప్రాంత జెండర్ బెధాలు పాటించకుండా భారత రాజ్యాంగ సమానత్య సూత్రాల పై అవగహన కల్పించాలి.
ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న బొజనానికి సైతం డైట్ చార్జీలు పెంచాలని కొరుతున్నాం.తెలంగాణ స్టడీ సర్కిల్ ల లో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగులకు 75 నుండి 150 రూపాయలకు పెంచాలి. గురుకులాల లో విద్యార్ధుల ఆత్మహత్యలను నివారించాలని మీ ద్వారా ప్రభుత్వ దృష్టి కి తీసుకెల్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు,నాయకులు చంద్రం తదితరులు పాల్గొన్నారు.