*శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠంలో డిజిటల్ జూమ్ తరగతులు*
*జమ్మికుంట జూలై 10 ప్రశ్న ఆయుధం*
శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం జమ్మికుంట పాఠశాలలో త్వరలో డిజిటల్ జూమ్ తరగతులు ప్రారంభించనున్నట్లు పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు అందుకు కావలసిన ఏర్పాట్లను చూస్తున్నట్లు విద్యాపీఠం మెరుగైన విద్యను అందించి విద్యార్థులలో నూతన ఉత్తేజాన్ని కలిగించాలని విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను డిజిటల్ జూమ్ తరగతుల ద్వారా ప్రతి తరగతిలో ప్రొజెక్టర్లు ఆధారంగా తరగతులను నిర్వహించబడతాయని అందుకోసం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సంకల్పంతో విద్యాపీఠం పనిచేస్తుందని, చిన్నపిల్లలకు ప్లే వే మెథడ్ ద్వారా విద్యను అందిస్తుందని విద్యాపీఠం యాజమాన్యం తెలిపారు
ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ఆవాల రాజారెడ్డి, కార్యదర్శి ఆకుల రాజేందర్, ప్రబంధకారిని అధ్యక్షుడు శీలం శ్రీనివాస్, కార్యదర్శి దాసరి రవీందర్, బుర్ర శివయ్య, చదువు కిరణ్ కుమార్ రెడ్డి, పాకాల రవీందర్ రెడ్డి, మాముడి ఐలయ్య, ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు