దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి 

దీక్ష దివాస్ ను విజయవంతం చేయాలి

గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

గజ్వేల్ నవంబర్ 28 ప్రశ్న ఆయుధం :

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటం తోనే తెలంగాణ కల సహాకారమైందని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.కెసిఆర్ చేపట్టిన ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. కెసిఆర్ తెలంగాణ కోసం ఎంతో తపించారు అన్నారు. దేశంలో ఉండే నాయకులందరినీ ఒకే తాటిపై తెచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి దీక్ష దివాస్ లాంటి దీక్షలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించారన్నారు. ఆరోజు కరీంనగర్ నుండి దీక్ష దివాస్ కు బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కెసిఆర్ సచ్చుడో అనే ఉద్వేగ భరిత నినాదంతో ఆరోజు కెసిఆర్ బయలుదేరి చావు నోట్లో పులిపెట్టి తెలంగాణ రాష్ట్ర కల సాకారం చేసి తెలంగాణ రాష్ట్ర సాధించి పెట్టిన మహా నాయకుడు కేసీఆర్ అన్నారు. నాడు స్వాతంత్రం సాధించడానికి గాంధీజీ భారతదేశాన్ని ఒక్క తాటిపైకి తెస్తే తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బానిస సంకెళ్ళకు బందీ అయిన తెలంగాణ దాస్య శృంకాలాలు పెంచడానికి కేసీఆర్ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్క తాటిపైకి తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు కెసిఆర్ చెప్పిన మాటలు నా దీక్ష వల్ల తెలంగాణ వస్తే జైత్రయాత్ర, లేకుంటే నా శవయాత్ర ఉంటుందని ఉద్వేగంగా చెప్పడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ది వచ్చింది అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడారు అన్నారు. కెసిఆర్ ఒక్కడితో మొదలైన తెలంగాణ ఉద్యమం నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలను కదిలించింది అన్నారు. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. సిద్దిపేటలో జరగబోయే దీక్ష దివాస్ లో ప్రతి ఒక్క తెలంగాణ వాది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పిటిసి లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపిటిసిలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు ప్రజలు, పెద్ద ఎత్తున 9 గంటల 30 నిమిషాలకు సిద్దిపేట పట్టణంలోని రంగధాంపల్లి చౌరస్తా వద్ద అమరుల అమరవీరుల స్థూపం వద్దకు రావాలని అక్కడి నుండి సిద్దిపేట టిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు పెద్ద ర్యాలీ ఉంటుందని ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు గత పది సంవత్సరాల కెసిఆర్ పరిపాలన హయాంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ధనిక రాష్ట్రంగా మారిందన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా వృద్ధాప్య వికలాంగ పెన్షన్లు రైతుబంధు రైతు బీమా 24 గంటల ఉచిత కరెంటు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్ల నీరు పండించిన పంటలను నేరుగా కొనుగోలు చేయడం కెసిఆర్ కిట్టు న్యూట్రిషన్ కిట్టు దళిత బంధు బీసీ బందు మైనార్టీ బందు లాంటి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను నేరుగా అవినీతి లేకుండా ప్రజల ఖాతాలో జమ చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అన్ని హంగులతో అభివృద్ధి చేశారన్నారు ఆకుపచ్చ తెలంగాణగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చిన ఘనత కేసిఆర్ ది అన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఐటీ లో భారతదేశంలో నంబర్ వన్ గా ఉన్నామన్నారు ఫార్మా లో నెంబర్ వన్ గా ఉన్నామన్నారు ఉపాధి కల్పనలో ప్రథమ స్థానంలో ఉన్నామన్నారు కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్న ఏ పథకం అమలు చేసిన ఒక చరిత్రలో మిగిలిపోతుంది అన్నారు. కానీ నేడు అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక గ్యారెంటీ ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు రోజుకు డైవర్షన్ రాజకీయాలతో రాజకీయాల దీని కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పొందుతున్నారు అని అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఇప్పటివరకు వానాకాలం యాసంగి రైతుబంధు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారన్నారు. మహిళలకు 2500 భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేసిందని చెప్పారు అంతేకాకుండా స్కూటీ లు ఇస్తామని చెప్పి కూడా మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డి సర్కార్ కు దక్కుతుందన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు అభివృద్ధి సంక్షేమం శూన్యమని వంటేరు ప్రతాపరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. నేడు సిద్దిపేటలో తల పెట్టబోయే దీక్ష దివాస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆరు గ్యారెంటీ లపై ఎండ గడతామని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలుపుదాం అని వంటేరు ప్రతాపరెడ్డి అన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్.సి రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్,వైస్ చైర్మన్ జకీయొద్దిన్, జెడ్పిటిసిలు మంగమ్మ రామచంద్రం, పంగ మల్లేశం, జయమ్మ అర్జున్ గౌడ్,ఎంపీపీ పాండు గౌడ్ పిఎస్ఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్,మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నూనె కుమార్ యాదవ్,పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, యూత్ వింగ్ నాయకులు జుబేర్ భాష, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి దయాకర్ రెడ్డి నరేష్ గుప్తా చంద్రశేఖర్ గుప్తా, గణేష్ గుప్తా, నాయకులు గాలెంక నర్సింలు , అహ్మద్ పాల రమేష్ గౌడ్ స్వామి చారి తుమ్మ గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment