ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల దిశానిర్దేశం

ధాన్యం కొనుగోళ్లపై మంత్రుల దిశానిర్దేశం

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15

రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మత్స్యశాఖ మంత్రి వాకాటి శ్రీహరి, సిఎస్ రామకృష్ణారావు తదితరులు ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. క్వాలిటీ ప్రకారం ఎంఎస్పీ, బోనస్ చెల్లింపులు సకాలంలో జరగాలన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలోనే దేశంలో పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. వర్షాలు, రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమై 5.98 లక్ష మెట్రిక్ టన్నుల వరి వచ్చే అవకాశం ఉందని, అన్ని PPC కేంద్రాలను ఎత్తైన సురక్షిత ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. రైతుల చెల్లింపులు 48-72 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment