విజయానికి వికలాంగత అడ్డు కాదు: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజయానికి వికలాంగత అడ్డు కాదని, దివ్యాంగులు సవ్యాంగులకు ధీటుగా అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుతున్నారని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో మహిళా, శిశు మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య క్రీడా పోటీలను ప్రారంభించి పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు సవ్యాంగులకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని రంగాలలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారని, ప్రభుత్వం అందరి కోసం సమాన అవకాశాలు, సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. క్రీడలు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు వారిలోని ప్రతిభను వెలుగులోకి తెస్తాయని అన్నారు. కార్యక్రమంలో వివిధ క్రీడా విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా వచ్చిన దివ్యాంగులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వీరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రన్నింగ్, షాట్‌పుట్, వీల్‌చెయిర్ రేస్, ఇండోర్ గేమ్స్ తదితర విభాగాల్లో పోటీలు జరిగాయి. ఆయా పోటీలను కలెక్టర్ ప్రత్యేకంగా దగ్గరుండి పరిశీలించడంతో పాటు క్రీడాకారులను చైతన్య పరిచారు. అనంతరం విజేతలకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, అధికారులు, కోచ్‌లు, వాలంటీర్లు, దివ్యాంగులు, దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment