Site icon PRASHNA AYUDHAM

దివ్యాంగులను చిన్నచూపు చూడవద్దు.

దివ్యాంగులను
Headlines
  1. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి: సీతక్క
  2. 50 కోట్ల రూపాయలతో దివ్యాంగుల సంక్షేమం: మంత్రి ప్రకటన
  3. క్రీడల్లో, ఉద్యోగాల్లో రాణించాలి: ములుగు జిల్లా కార్యక్రమం
  4. దివ్యాంగుల కోసం మోడల్ వాహనాలు అందించనున్న ప్రభుత్వం
  5. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం: ములుగు క్రీడోత్సవాలు
దివ్యాంగులను చిన్నచూపు చూడవద్దు.

జిల్లా స్థాయి క్రీడోత్సవలను

ప్రారంభించిన…..రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క

దివ్యాంగులను ఎవరు చిన్నచూపు చూడవద్దని, దివ్యాంగులు ఆందోళన చెందకుండా ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.  

శనివారం ములుగు జిల్లా కేంద్రం లోని జూనియర్ కళాశాల మైదానం లో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి క్రీడోత్సవలను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్., గ్రంథాలయాల చైర్మెన్ రవి చందర్ లతో కలిసి మంత్రి జండా ఊపి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవయవాలు పని చేస్తే లేవని ఆవేదన చెందకుండా క్రీడలలో, ఉద్యోగ రంగాలలో రాణించాలని కోరారు. గత పాలకులు దివ్యాంగుల సంక్షేమం కోసం 10 కోట్ల రూపాయలను కేటాయించగా 

నేటి ప్రజా ప్రభుత్వం 50 కోట్లను కేటాయించిందని, ఇప్పటికే వికలాంగులకు పలు రకాల వాహనాలు అందిస్తుండగా రానున్న రోజులలో వారు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందడానికి మాడల్ వాహనాలు అందజేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి K. శిరీష, ఎస్సి కార్పొరేషన్ ఈ డి తూల రవి, దివ్యాంగుల సంఘాల నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version