Site icon PRASHNA AYUDHAM

తెలంగాణకు నిరాశ…

IMG 20240723 WA0969

తెలంగాణను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్ :

ఆంధ్ర, భీహార్ రాష్ట్రాలకు ఒక న్యాయం తెలంగాణకు ఒక న్యాయమా

కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులలొ అధిక మొత్తం తెలంగాణ రాష్ట్రానిది. అయినా రాష్ట్రానికి మొండిచేయి చూపించిన కేంద్రం

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వుసే లేదు.

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్
ప్రతినిధి.(జులై- 23)

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం మండలం లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జై జవాన్ జై కిసాన్ రైతును రాజునుచేయాలని సంకల్పంతో. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా. లోటు బడ్జెట్ ఉన్న కూడా తెలంగాణ రాష్ట్రం రైతు రుణమాఫీ చేసి. రైతన్నకు చేయూతనిస్తుంటే. నేడు కేంద్రం ప్రకటించిన వార్షిక బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం, తెలంగాణ ప్రజల పట్ల కేంద్ర వైఖరి మరో మారు బట్టబయలైంది అని అన్నారు. 8 మంది బిజెపి ఎంపీలను గెలిపించి ఢిల్లీకి పంపితే. కాళీ సూట్ కేస్ ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది.
పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి, బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కొన్ని వేల కోట్లు ఇచ్చి. మన రాష్ట్రానికి మొండి చేయి చూపించింది.
గత 10 సంవత్సరాలుగా కేంద్ర బడ్జెట్ విషయంలో తెలంగాణను చిన్నచూపు చూస్తుంది. 10 ఏండ్లు అయిన పైసా తీసుకురాని 8 మంది బిజెపి ఎంపీలు ఆత్మ విమర్శన చేసుకోవాలి.
బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వుసే లేదు.
హైదరాబాద్ -బెంగళూరు కారిడార్ తోపాటు హైదరాబాద్- నాగపూర్ కూడా ప్రకటించి ఉంటే ఉత్తర తెలంగాణ బాగుపడుతుండే. బిజెపి ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాదు. ముందు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాష్ట్రానికి నిధులు తీసకొని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు కావాలి కాని ఆ పని చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పని తీరు గురించి ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటే బాగుంటది అని
నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ప్రచారకమిటి అధ్యక్షులు బొడ్ల రాజు అన్నారు.

Exit mobile version