* *ఐటిడిఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సచివాలయంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి v.c. గౌతమ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి A. శరత్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి లతో మంత్రి సీతక్క సమీక్ష*
గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు ఐటీడీఏ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విధివిధానాలపై చర్చ
అధికారులకు కీలక సూచనలు చేసిన మంత్రి సీతక్క
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లాల్లో కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. ఐటీడీఏ పరిధిలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు అప్పజెప్పాలని సూచించిన మంత్రి సీతక్క
ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఐటీడీఏ పీవోలకు పంపి అర్హులను గుర్తించాలని ఆదేశాలు
ఐటీడీఏ పరిధిలో చాలామంది ఇంకా పాకల్లోనే నివసిస్తున్నారనీ.. వారికి మొదటి ప్రాధాన్యతలో ఇండ్లను మంజూరు చేయాలని సూచించిన సీతక్క