సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 11 (ప్రశ్న ఆయుధం న్యూస్) జిల్లాలోని సదాశివపేట లోగల ఎంఆర్ఎఫ్ కంపెనీ యాజమాన్యం కంపెనీలో పనిచేస్తుంది ట్రైనీ కార్మికుల మధ్య తలెత్తిన వివాదం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి జోక్యంతో జరిగిన చర్చల్లో ఒక కొలిక్కి వచ్చాయి. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తన కార్యాలయంలో ఎంఆర్ఎఫ్ ట్రైనీ కార్మికులు, కంపెనీ యజమాన్యంతో నిన్న సోమవారం సాయంత్రం చర్చలు జరిపారు. ట్రైనీ కార్మికుల తమ ఇష్టా పూర్వకంగా కంపెనీలో పని చేయదలుచుకుంటే వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకోవడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది. సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం ప్రకారం తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. వారి పనితీరు అర్హతలను బట్టి వారికి వేతనం రూ. 18 వేల నుండి రూ.24 వేల వరకు ఇవ్వడానికి కంపెనీ యజమాన్యం అంగీకరించింది. కాంట్రాక్టు కార్మికులుగా 10 సంవత్సరాలకు పైగా పని చేసిన ట్రైనీ కార్మికులకు గతంలో యాజమాన్యం ఇచ్చిన హామీ మేరకు గ్రాట్యూటీ చట్టం ప్రకారం గ్రాట్యూటీ డబ్బులు చెల్లించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాలు యాజమాన్యం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప కార్మిక కమీషనర్ రవీంధర్ రెడ్డి, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
కలెక్టర్ నేతృత్వంలో ఎంఆర్ఎఫ్ యాజమాన్యం ట్రైనీ కార్మికుల మధ్య చర్చలు
Updated On: March 11, 2025 7:03 pm
