స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు

*పోచారం శ్రీనివాస్ రెడ్డితో తోట లక్ష్మీ కాంతారావు భేటీ*

*ఇద్దరు ఎమ్మెల్లె లు కలిసి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ*

*స్థానిక ఎన్నికల వ్యూహాలు- ప్రణాళికలపై మంతనాలు*

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక ప్రతినిధి

జనవరి-09

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు,

సీనియర్ రాజకీయ నాయకులు,బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు..

స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు..

ప్రభుత్వం చేపడతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లటంపై ఇరువురు నేతలు మంతనాలు సాగించారు.. కామారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.. సీనియర్ నాయకులైన పోచారంతో కలిసి వివిధ అంశాలపై చర్చించిన ఆయన ప్రతిపక్ష పార్టీల అసత్య ప్రచారాల్ని తిప్పికొట్టాలన్నారు.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కామారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునేలా ప్రచారం చేయాలన్నారు.. ఎన్నికలపై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులకు దిశానిర్దేశంపై మాట్లాడారు..

ఎమ్మెల్యేతో పాటు NRI , వ్యాపార వేత్త భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment