*పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నియంత్రణ*
*డాక్టర్ కార్తీక్,డాక్టర్ మహోన్నత పటేల్.
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 20*
పరిసరాల పరిశుభ్రత తోనే సీజనల్ వ్యాధులను నియంత్రించవచ్చని డాక్టర్ కార్తీక్ డాక్టర్ మహోన్నత పటేల్ అన్నారు.జమ్మికుంట మండలం వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వావిలాల గ్రామపంచాయతీ వద్ద డాక్టర్ కార్తీక్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు వైద్య శిబిరంలో 54 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. 6 గురు జ్వర పీడితులను గుర్తించి వారి రక్త నమూనాలను సేకరించి మలేరియా వ్యాధి నిర్ధారణ కొరకు ల్యాబ్ కి పంపించారు అదేవిధంగా వారికి ఆర్ డీ టి కిట్స్ ద్వారా డెంగీ పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసి అవసరం వున్నవారికి మందులు అందజేశారు. జమ్మికుంట పట్టణంలోని వర్తకసంఘం 30 వ వార్డులో డాక్టర్ మహోన్నాతాపటేల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 61 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు 4 గురు జ్వరం ఉన్నా వారికి రక్త పూతల నమూనాలను సేకరించి వ్యాది నిర్ధారణ పరీక్షలకొరకు ల్యాబ్ కి పంపించినారు. వైద్య శిబిరములకు వచ్చిన ప్రజలకు డాక్టర్ కార్తీక్, డాక్టర్ మహోన్నాతాపటేల్ హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి సీజనల్ వ్యాధులు, కీటకాలు దోమల ద్వారా వచ్చే డెంగీ, మలేరియా, చికెన్ గున్య, బోధకాలు, మెదడు వాపు మొదలగు వ్యాధులు వ్యాపించు విధానం, వ్యాధుల లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. నీటీ నిల్వలలో వుండే దోమల లార్వాలను ఎప్పటికప్పుడు పారాబోసి, దోమలు ఎదగాకుండా, కుట్టకుండా చూచుకొని వ్యాధుల బారినుండి రక్షికించు కోవాలని గ్రామస్తులకు సూచించారు. ఎచ్ ఐ వి, ఎయిడ్స్ కంట్రోల్ లింక్ వర్కర్ రాజు సుఖ వ్యాధుల పై ప్రజలకు అవగహన కల్పించారు. జమ్మికుంట -1 సబ్ సెంటర్ ఏరియా లోని అంగన్వాడీ కేంద్రంలో డాక్టర్ చందన వయసుకు తగిన బరువు, ఎత్తు పోషకహారం లోపంవున్నా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో డాక్టర్ కార్తీక్, డాక్టర్ మహోన్నత, డాక్టర్ చందన, హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి, సూపర్ వైజర్స్ రత్నకుమారి, అరుణ, హెల్త్ అసిస్టెంట్ నరేందర్, 30 వ వార్డ్ కౌన్సిలర్ యం లావణ్య వావిలాల పంచాయతీ కార్యదర్శి రాము, ఏఎన్ఎంలు సాజిదా పర్వీన్,హైమవతి, రజిత, రాధ ఎయిడ్స్ కంట్రోల్ లింక్ వర్కర్ రాజు, ఆశాకార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.