అసహ్యం వేస్తోంది దొరా  – కెసిఆర్ పై విజయశాంతి ఉగ్రరూపం

అసహ్యం వేస్తోంది దొరా

– కెసిఆర్ పై విజయశాంతి ఉగ్రరూపం

“ఎమ్మెల్సీ ఇస్తే ఎందుకు తట్టుకోలేక పోతున్నారు దొరా! పెద్ద మనసు ఉంటే మెచ్చుకోండి లేకపోతే నోరు మూసుకోండి! కాంగ్రెస్ ఎందుకిచ్చింది అంటే ఇచ్చింది! తట్టుకోలేక పోతున్నారా? అసహ్యం వేస్తోంది దొరా! ఆస్థులు అమ్మి త్యాగాలు చేసి చిత్తశుద్ధి తో తెలంగాణ ఉద్యమం చేశాను. నాకు హక్కు లేదా? తెలంగాణ తల్లి పార్టీ పెట్టుకుని నేను ఉద్యమిస్తే జయశంకర్ సార్ ను పంపించి విలీనం చెయ్ విలీనం చెయ్ అంటూ బతిమలాడి విలీనం చేసుకున్నది నిజం కాదా? విలీనం చేయమని మీరు అడిగారా? విలీనం చేస్తానని నేను అన్నానా? నేను గట్స్ వున్న దాన్ని! నీలా పిరికి పందను కాను. ప్రతిరోజూ అవమానించావు! ప్రతిరోజూ కష్ట పెట్టించావ్! కాంగ్రెస్ లోకి వెళితే సహించలేక పోతున్నావ్! చిన్న ఎమ్మెల్సీ ఇస్తేనే తట్టుకోలేక పోతున్నావ్! రాజకీయ నాయక శత్రువుల్లారా చూపిస్తా నేనేంటో! ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ఖబద్దార్!

కెసీఆర్ నిన్ను వదిలి పెట్టను. అవినీతి లెక్కలన్నీ తేలుస్తా! ఏడు లక్షల కోట్ల అప్పు ఎలా అయిందో విడిచి పెట్టకుండా అడుగుతూనే వుంటా. సమయం దగ్గర పడింది. ఇప్పటికైనా నిజాలు మాట్లాడు కెసిఆర్. మేం ఆస్థులు అమ్మి కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం ఇది. దొర బుద్ధి పోనిచ్చుకోలేవులే. దొరలు వేస్తేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావా? మేమందరం వేసి నిన్ను గెలిపించాం, గుర్తుందా కెసిఆర్.

ఎమ్మెల్సీ గా వస్తున్న. నీ బండారం బయట పెడతానని భయం పట్టుకుందా? జ్వరం వస్తోందా? గుండె పోట్లు వస్తున్నాయా? నా పార్టీని విలీనం చేసుకుని నన్ను మోసం చేసినవి గుర్తుకొస్తున్నాయా? నిద్ర పట్టడం లేదా కెసిఆర్. తెలంగాణ నీ సొత్తు కాదు. తెలంగాణ నీ ఒక్కడితో రాలేదు దొరా! తెలంగాణ ఇస్తున్నప్పుడు అసలు నువ్వు పార్లమెంట్ లో కూడా లేవు.

విజయశాంతి కి తెలంగాణకు సంబంధం లేదా? బిజెపి వాళ్ళను హెచ్చరిస్తున్న! తెలంగాణ వ్యతిరేక శక్తులను దింపే మీ ప్రయత్నాలు ఇక సాగవు. తెలంగాణ ఉద్యమకారులపై మీ కుట్రలు చెల్లవు. నాకు ఎమ్మెల్సీ ఇస్తే మీకెందుకు అక్కసు? ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నారు కాబట్టే నేను బిజెపి లోకి వచ్చాను. నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? కెసిఆర్ అయితే అప్పుడు టిడిపి లో ఉన్నారు. బిఆర్ఎస్, బిజెపి పార్టీలకు సేవ చేశాను. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోయారు కాబట్టి రెండు పార్టీలను వదిలేసాను. ఒక్కొక్కరి అంతు చూస్తా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి ”

(గురువారం గాంధీభవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిప్పులు చెరిగిన విజయశాంతి)

Join WhatsApp

Join Now

Leave a Comment