ఆరోగ్య సమస్యలతో వ్యక్తి జీవితంపై విరక్తి ఆత్మహత్య
తాపీ మేస్త్రి రైలు కింద పడి ఆత్మహత్య
_ఆరోగ్య సమస్యలే కారణం:రైల్వే పోలీస్
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ డిసెంబర్ 26:
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఒక తాపీ మేస్త్రి జీవితంపై విరక్తితో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఈ ఆత్మహత్య గల వివరాలను రైల్వే పోలీసులు వెల్లడిస్తూ కామారెడ్డి రుక్మిణికుంట ప్రాంతంలో నివాసి అయిన తాపీ మేస్త్రి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ కన్నయ్య 62 అనే కుటుంబం ప్రకాశం జిల్లా నుండి గత 40 సంవత్సరాల క్రితం కామారెడ్డిలో స్థిరపడి తాపీ మేస్త్రి గా జీవనం సాగిస్తున్నారు. మృతునికి రెండు సంవత్సరాల కిందట అనారోగ్యంతో పక్షవాతం వచ్చి నడవలేని స్థితిలో ఉన్నాడని, ఈ ఆరోగ్య సమస్య వలన జీవితంపై విరక్తి చేయండి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని తెలిపారు. మృతునికి భార్య , ఇద్దరు కుమారులు , నలుగురు కుమార్తెలు ఉన్నారని తెలియజేశారు. మృతుని భార్య రవణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే స్టేషన్ ఎస్సై సాదు లింబాద్రి తెలిపారు.