చీకటిని పారద్రోలి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి  – కప్పర ప్రసాద్‌రావు

చీకటిని పారద్రోలి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి

– కప్పర ప్రసాద్‌రావు

టీజేయు రాష్ట్ర అధ్యక్షుడు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..

దీపావళి చీకటిని పారద్రోలి వెలుగులు నింపే పండుగగా నిలవాలని ఆకాంక్ష

ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకోవాలని పిలుపు

ప్రేమ, సౌభ్రాతృత్వం, సామరస్యమే సమాజానికి నిజమైన వెలుగు అని వ్యాఖ్య

జర్నలిస్టులు సత్యానికి అద్దం పట్టే బాధ్యత వహిస్తున్నారని ప్రశంస

పటాకులతో కాదు, ప్రేమతో దీపావళి జరుపుకోవాలని సూచన

ప్రశ్న ఆయుధం అక్టోబర్ 19హైదరాబాద్:

దీపాల పండుగ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్‌ (టీజేయు) రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్‌రావు ప్రజలకు, జర్నలిస్టులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగుల పండుగగా నిలిచే దీపావళి ప్రతి ఇంటిలో సంతోషం, శాంతి, ఐశ్వర్యం నింపాలని ఆయన ఆకాంక్షించారు.

జర్నలిస్టు సమాజం ప్రజల సమస్యలను వెలుగులోకి తెచ్చి సత్యానికి అద్దం పట్టే బాధ్యత వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాంటి జర్నలిస్టులు సుఖశాంతులతో, ఆరోగ్యంతో, అభివృద్ధితో ఉండాలని కోరారు.

సమాజంలో సత్యం, న్యాయం, ప్రజాహితం నిలదొక్కుకునే దిశగా జర్నలిస్టులు వెలుగుల దీపాల్లా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజలందరూ ఐకమత్యంతో, ఆనందంగా దీపావళిని జరుపుకోవాలని కోరిన ఆయన, “బాంబులు, పటాకులతో కాదు… ప్రేమ, అనురాగాలతో వెలుగుల పండుగను జరుపుకుందాం” అని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment